: పాతబస్తీ అభివృద్ధి, నగర సుందరీకరణకే ప్రాధాన్యం: కొత్త కమిషనర్
హైదరాబాద్ మహానగరంలో రహదారుల సుందరీకరణ, పాతబస్తీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. కృష్ణబాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణబాబు చేపట్టిన పథకాలు కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పథకాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమ్మెలో ఉన్న పురపాలక సంఘ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేశారు.