: సచిన్ కు ముంబయి క్రికెట్ సంఘం వినూత్న కానుక
క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ కాబోతున్న సచిన్ టెండూల్కర్ ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఒక ఆశ్చర్యకర బహుమతితో సత్కరించాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా ఏం బహుమతి కావాలంటూ సచిన్ ను సంప్రదించింది. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక చిత్రం కావాలని సచిన్ కోరారు. అంతే, ఎంసీఏ ప్రసిద్ధ చిత్రకారుడు ప్రపుల్ సావంత్ పై ఆ భారాన్ని వేసింది. ఎంసీఏ, సావంత్ 10 రకాల చిత్రాలకు సంబంధించిన కాన్సెప్ట్ లను సచిన్ కు వినిపించారు. వాటిలో సచిన్ ఎంపిక చేసిన దాన్ని సావంత్ చిత్రిస్తారు. ఎందువల్లో తెలియదు కానీ తానింతవరకు సచిన్ చిత్రాన్ని వేయలేదని, కానీ ఇప్పుడు తాను వేయబోయే చిత్రం ఎప్పటికీ సచిన్ తోనే ఉండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు సావంత్.