: అగ్నిప్రమాద బాధితుల్లో ముగ్గురు మృతి


అనంతపురం పట్టణంలో ఈ రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో ముగ్గురు మృతి చెందారు. పాతవూరులోని రాణీనగర్ కి చెందిన రాజు కుటుంబం పెట్రోలు విడిగా అమ్మి జీవనం సాగిస్తోంది. పెట్రోలు క్యాను అటక మీదినుంచి కిందకి దింపుతున్న సమయంలో పెట్రోల్ మండుతున్న పొయ్యి మీద పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో, నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటల్లో చిక్కుకున్నారు. వారిని స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News