: అగస్టా వెస్ట్ లాండ్ కు రక్షణ శాఖ షోకాజ్ నోటీస్
సంచలనం సృష్టించిన హెలికాప్టర్ల ఒప్పందం వ్యవహారంలో అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి రక్షణ శాఖ తుది షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా, హెలికాప్టర్ల కొనుగోలుపై లిఖిత పూర్వకంగా చేసుకున్న ఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించినట్టు రక్షణ శాఖ నోటీసులో పేర్కొంది. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారి, అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో .. భారత్, ఇటలీకి చెందిన దర్యాప్తు సంస్థలు కుంభకోణం నిగ్గు తేల్చే పనిలో పడ్డాయి.