: వాళ్ళిద్దరిలా చచ్చిపోవాల్సి వచ్చినా భయపడను: రాహుల్


నాయనమ్మ, నాన్న తీవ్రమైన విద్వేషానికి బలైపోయారని.. వారిలాగే తానూ ఏదో ఒకరోజు చావాల్సి వస్తే భయపడబోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్ లోని చురులో ఆయన మాట్లాడుతూ, విద్వేష రాజకీయాలు దేశ లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో మత ఘర్షణలు జరిగిన ముజఫర్ నగర్ ప్రాంతాన్ని తాను సందర్శించినప్పుడు అక్కడి హిందూ, ముస్లింలతో మాట్లాడానని అన్నారు.

వారు అల్లర్ల పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే, తాను బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు. 'ముజఫర్ నగర్ లో మంటపెట్టారు. గుజరాత్ లో మంటపెట్టారు. కాశ్మీర్ లో మంటపెడుతున్నారు, ఇలా అన్ని చోట్లా వారు మంటలు రేపుతుంటే మేము వాటిని ఆర్పాల్సి వస్తోంది' అని మండిపడ్డారు. ఇది దేశాన్ని అస్థిరపరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ ఆగ్రహావేశాలలో, హింసాత్మక ఘటనల్లో అమూల్యమైన ప్రాణాలు పోతున్నాయని ఆక్షేపించారు.

'మా నాయనమ్మ హత్యకు గురైంది, మా నాన్నను పొట్టన పెట్టుకున్నారు, ఏదో ఒక రోజు నన్నుకూడా చంపేస్తారేమో..! అయినా నేను దానిగురించి భయపడట్లేదు' అని అన్నారు.

  • Loading...

More Telugu News