: వాగులో పడ్డ 9 మంది విద్యార్థులు.. ఇద్దరి గల్లంతు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లెకు చెందిన విద్యార్థులు రావిచెరువు వాగులో చిక్కుకుపోయారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొమరోలు-సూరావారిపల్లె నడుమ రావి చెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సూరావారిపల్లెలోని పాఠశాల నుంచి కొమరోలు గ్రామానికి వెళ్లే 20 మంది విద్యార్థులు రావిచెరువు వాగు దాటుతుండగా వారిలో 9 మంది విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు విద్యార్థులను కాపాడగలిగారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.