: రాంచీ కోర్టులో ఇమామ్ ను హాజరు పరిచిన పోలీసులు
రాంచీలో అదుపులోకి తీసుకున్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది మంజర్ ఇమామ్ ను పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. హైదరాబాద్ పేలుళ్లతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఉదయం ఇమామ్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులోనూ ఇమామ్ కోసం ఎన్ఐఏ అధికారులు రెండేళ్లుగా వెతుకుతున్నారు.