: వరద బాధితుల నష్ట పరిహారం రూ. 80, రూ. 100, రూ. 150..
కంగారు పడకండి. ఇది మన రాష్ట్రంలో కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. గతేడాది వరదల ప్రభావానికి పంటలను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయమిది. చెక్కులు అందుకున్న వారికెవరికైనా ఆనందభాష్పాలు వస్తాయి. కానీ, ఇక్కడి రైతులకు మాత్రం నిజంగానే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే వారికి అందిన ఆర్థిక సహాయం రూ. 80, రూ. 100, రూ. 150 లు మాత్రమే. విదర్భ ప్రాంతంలోని ఓ రైతుకు 15 వేల రూపాయల మేర నష్టం వాటిల్లితే... అతనికి ఎనభై రూపాయలు పరిహారంగా ఇచ్చారు. వరదలతో నష్టపోయిన వేలాది మంది రైతుల పరిస్థితి ఇదే. ప్రభుత్వ సాయం చూసి ఒళ్లు మండిన రైతులు పరిహారం చెక్కులను తీసుకోవడానికి నిరాకరించారు.