: కోలుకుంటున్న ఏఎన్నార్
కేన్సర్ బారినపడిన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు క్రమంగా కోలుకుంటున్నారు. ఆయనకు హైదరాబాదులోని కిమ్స్ లో ఈ నెల 19న శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన తేలికపాటి ఆహారం తీసుకుంటున్నారని, ఈ ఉదయం లేచి ఓ వంద గజాలు నడిచారని చెప్పారు. కాగా, అక్కినేనిని సందర్శించడానికి ఎవరూ రావొద్దని, కోలుకునే క్రమంలో ఇబ్బందికి గురిచేయవద్దని సన్నిహితులకు, అభిమానులకు ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.