: రెండు, మూడు వారాల్లో ఉల్లి ధరలు తగ్గుతాయి: శరద్ పవార్
రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగి వస్తాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చెప్పారు. అవసరమైతే చైనా నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటామన్నారు. కాగా, ఉల్లి పండించే రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో రేపు ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ మార్కెట్లో ఉల్లి కేజీ రూ.90 కు పెరిగిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.