: సెలవు పెట్టి మరీ 'ఆమ్ ఆద్మీ' పార్టీకి ప్రచారం చేస్తోన్న వేలాది ప్రొఫెషనల్స్


నమ్మలేక పోయినా ఇది నిజం. ఎందుకంటే అవినితి కంపు కొడుతున్న రాజకీయ నాయకులతో ఢిల్లీలోని ఉద్యోగులు విసిగిపోయారు. అవినీతిపై పోరాటమే లక్ష్యంగా బరిలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతు పలుకుతున్నారు. తమ ఉద్యోగాలకు సైతం విరామం ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే దాదాపు 7 వేల మంది డాక్టర్లు, ఇంజినీర్లు, బ్యాంకర్లు, ఎన్నారైలతో పాటు వివిధ రంగాల నిపుణులు ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. త్వరలోనే మరింత మంది వీరి బాటలో నడవనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News