: వెలిసిన వాన.. వేటాడుతున్న షమి
రాంచీలో వర్షం వెలిసింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయినాగానీ, టీమిండియా పేసర్ మహ్మద్ షమి జోరు ఇసుమంతైనా తగ్గలేదు. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికే రెండు వికెట్లు తీసి ఆసీస్ ను కష్టాల పాల్జేసిన ఈ బెంగాల్ యువ పేసర్.. మ్యాచ్ మళ్ళీ మొదలైన తర్వాత డేంజరస్ బ్యాట్స్ మన్ వాట్సన్ (14) ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెయిలీ (18 బ్యాటింగ్), వోగ్స్ (4 బ్యాటింగ్) ఉన్నారు.