: ఢిల్లీ పెద్దలను మర్యాదపూర్వకంగానే కలిశా: గవర్నర్ నరసింహన్


ఈ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన గవర్నర్ నరసింహన్ వెంటవెంటనే ఢిల్లీ పెద్దలను కలవడంపై స్పందించారు. ఢిల్లీ వచ్చి చాలా రోజులైందని అన్నారు. అందుకే, ఇక్కడికి రాగానే మర్యాదపూర్వకంగా పెద్దలను కలిసినట్లు చెప్పారు. పెద్దలను కలిసినప్పుడు రాష్ట్ర విభజన అంశాలు చర్చకు రాలేదని తెలిపారు. కాగా.. రేపు, ఎల్లుండి కూడా గవర్నర్ ఢిల్లీలోనే ఉంటారు.

  • Loading...

More Telugu News