: ఒడిశా తుపాను బాధితులకు రిలయన్స్ ఉచిత టాక్ టైం
ఫైలిన్ తుపాను ధాటికి ఒడిశా వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారడంతో... వారికి చేయూతనందించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ముందుకొచ్చింది. తుపాను ధాటికి చెల్లాచెదురైన కొందరి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో, ఇక్కడి ప్రజలకు ఫ్రీగా రోజుకు పది నిమిషాల టాక్ టైం ను ఇస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. సీడీఎంఏ, జీఎస్ఎం రెండు రకాల వినియోగదారులకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. తప్పిపోయిన వారిని కనుక్కోవడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని రిలయన్స్ తెలిపింది. దీనికి తోడు, సెల్ ఫోన్లకు ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా తమ స్టోర్స్ వద్ద, ప్రధాన మార్కెట్ల వద్ద రిలయన్స్ ఏర్పాట్లు చేసింది. దీనికోసం పెద్ద పెద్ద బ్యాటరీలను ఏర్పాటు చేసింది. తుపాను దెబ్బకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా దెబ్బతినడంతో... ఈ సౌకర్యాన్ని కల్పించింది.