: 23 ఏళ్ల తర్వాత సూకీకి అవార్డు ప్రదానం
మయన్మార్ ప్రజాస్వామ్య యోధురాలు అంగ్ సాన్ సూకీ 1990 సంవత్సరానికి సంబంధించి యూరోపియన్ యూనియన్ సఖరోవ్ శాంతి అవార్డును అందుకున్నారు. 1990లోనే ఆమెకు అవార్డు ప్రకటించినా.. ఆ సమయంలో సూకీ మయన్మార్ లో గృహ నిర్బంధంలో ఉండడంతో తీసుకోలేకపోయారు. దీంతో, నాటి అవార్డును యూరోపియన్ పార్లమెంటు స్పీకర్ మార్టిన్ ఓ కార్యక్రమంలో సూకీకి ప్రదానం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.