: ఆసీస్ ఓపెనింగ్ జోడీని విడదీసిన షమి
బెంగాల్ పేసర్ మహ్మద్ షమి భారత్ కు బ్రేకిచ్చాడు. రాంచీ వన్డేలో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. రెండో ఓవర్లో ప్రమాదకర ఫించ్ (5) ను షమి అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజులో హ్యూస్ (4 బ్యాటింగ్), వాట్సన్ (0 బ్యాటింగ్) ఉన్నారు.