: భారీ స్కోర్ దిశగా టీమిండియా
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా, ఆసిస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కుర్ర బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ 150 (332) పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు రోజు స్కోరుతో రెండవరోజు బ్యాటింగ్ కు దిగిన పూజారా కూడా 179 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. కాగా ఒక వికెట్ నష్టానికి ఆదివారం 311 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 350 పరుగుల భారీ స్కోరుతో మ్యాచ్ కొనసాగిస్తోంది.