: ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరు ప్రకటించిన బీజేపీ


వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీఎం అభ్యర్థిత్వంపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.. సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ ఈఎన్ టీ వైద్య నిపుణుడికి ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అంతేగాకుండా, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలకు ఈయన అత్యంత విధేయుడిగా పేరుగాంచారు.

  • Loading...

More Telugu News