: భారత్ తో యుద్ధాన్ని కోరుకుంటున్న లష్కరే తోయిబా చీఫ్


కరడుగట్టిన పాక్ జిహాదీ, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ భారత్ తో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. దీనికి సంబంధించి పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ ఐ)తో కలసి పథక రచన చేస్తున్నాడు. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు నిర్ధారించారు. తన విధ్వంస వ్యూహ రచనలో భాగంగా హఫీజ్ సయీద్ ఈ ఏడాది చివరి కల్లా దాదాపు 800 మంది కరడుగట్టిన తీవ్రవాదులను మన భూభాగంలోకి జొప్పించడానికి కసరత్తులు మొదలుపెట్టాడు.

26/11 ముంబై దాడుల తర్వాత పెద్దగా ఏమీ చేయని లష్కరే తోయిబా మరో దారుణ మారణ హోమానికి ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే వాస్తవాధీన రేఖ వద్ద పాక్ బలగాలు నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. పాక్ బలగాలపై మన సైన్యం కాల్పులు జరిపే సమయంలో... లష్కరే తీవ్రవాదులు మన గడ్డపైకి చొచ్చుకు వస్తారు. ఇదీ హఫీజ్ వ్యూహం. ఇంకో విషయం ఏంటంటే... వాస్తవాధీన రేఖ దగ్గర్లో ఉన్న ఉగ్రవాద క్యాంపుల్లో రోజుకు ఐదు గంటలపాటు హఫీజ్ గడుపుతున్నాడు. భారత్ లో చొరబడటానికి సిద్ధంగా ఉన్న తీవ్రవాదులకు జిహాదీ యుద్ధానికి సంబంధించిన సూచనలు చేస్తున్నాడు.

దీనికి తోడు, పాక్ సైన్యం కూడా యుద్ధానికి కాలుదువ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఎన్నోసార్లు మన సైన్యం చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ పాక్ సైన్యం బుద్ధి మారడం లేదు. కుక్క తోక వంకరలాగ అది తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు.

  • Loading...

More Telugu News