: లాడెన్ పై పీకల్లోతు ప్రేమలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్


ఆల్ ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ పై ఎవరైనా ప్రేమను పెంచుకుంటారా?..పెంచుకున్నా అది బహిరంగ పరుస్తారా?.. ఒకవేళ అటువంటి ప్రేమికురాలు వుంటే కనుక తను ఉగ్రవాదైనా అయివుండాలి, లేదా, అమెరికాని ద్వేషించే మనిషైనా అయివుండాలి. ఇవేవీ కాకపోయినా, ఒసామా అంటే విపరీతమైన ఇష్టమని చెబుతోంది 'వైట్ విడో' పేరిట ప్రసిద్ధురాలై, వివాదాస్పద రీతిలో ఇస్లాం మతాన్ని పుచ్చుకున్న సమంతా లేత్వయిటే. వివరాల్లోకెళితే.. ఆమెకు ఒసామా బిన్ లాడెన్ అంటే ఎంతో ప్రేమ. తాజాగా నైరోబీలో జరిగిన షాపింగ్ మాల్ దాడి ఘటనలో ఈమె హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఆమె లాడెన్ పై ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేస్తూ రాసిన లేఖలు బహిర్గతమయ్యాయి. లేఖ తప్పుల తడకగా ఉన్నా సమంత మాత్రం తాను చెప్పదలుచుకున్న అంశాన్ని మాత్రం విజయవంతంగా చెప్పగలిగిందని బ్రిటన్ పత్రికలు అంటున్నాయి. ఒసామా మరణంతో కుంగిపోయిన సమంత దీనికి కారకులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం కూడా చేసిందట. ఆమె నేర చరిత్ర కూడా ఘనంగానే ఉందని తెలుస్తోంది. తాజాగా కెన్యా రాజధాని నైరోబిలో ఆమెకు చెందిన ఫ్లాట్ లో జరిపిన సోదాలో ఓ కంప్యూటర్, పెన్ డ్రైవ్ తో పాటు బాంబుల తయారీపై పరిశోధన చేసినట్టు తగిన ఆధారాలు లభించాయి.

2005 జూలై 7 న కింగ్స్ క్రాస్, రస్సెల్ స్క్వేర్ ట్యూబ్ స్టేషన్ లో మానవ బాంబుగా మారిన జర్మన్ లిండ్సే భార్యే ఈ సమంత లేత్వయిటే. ఆ తరువాత కనిపించకుండా పోయిన సమంతా కొద్ది కాలంగా రాడికల్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్ షాబాబ్ సభ్యురాలిగా చేరినట్టు గుర్తించారు. ఆమెతో మరింత ప్రమాదం ఉన్నందున ఆమెపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News