: ఒబామాతో నేడు భేటీ కానున్న నవాజ్ షరీఫ్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ రోజు వైట్ హౌస్ లో భేటీ కానున్నారు. వైట్ హౌస్ లో ఇద్దరి మధ్య సమావేశం 90 నిమిషాల పాటు జరగనుంది. ముఖ్యంగా, కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యాన్ని నవాజ్ షరీఫ్ మరోసారి కోరనున్నట్లు సమాచారం. కాశ్మీర్ సమస్య విషయంలో అమెరికా జోక్యం అవశ్యమంటూ లోగడ షరీఫ్ ప్రకటన చేయగా.. అందుకు అమెరికా తిరస్కరించింది. అలాగే, తమ దేశంలో అమెరికా డ్రోన్ దాడులను కూడా నవాజ్ షరీఫ్ ప్రస్తావనకు తీసుకురాన్నారు. ఇరుదేశాల మధ్య విభేదాలు తొలగించుకుని సంబంధాలు బలపరచుకునేందుకు ఈ సమావేశం దోహదం చేయగలదని భావిస్తున్నారు.