: ప్రకాశం జిల్లాలో ఉరుములు, పిడుగులు, భూకంపం..
అల్ప పీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీని కారణంగా, ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. అదే సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు విడతలుగా రెండు సెకెన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.