: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ. 640కోట్లు


ప్రధాని మన్మోహన్ సింగ్ 9 ఏళ్ల కాలంలో విదేశీ పర్యటనలకు 640కోట్ల రూపాయలు ఖర్చుపెట్టేశారు. యూపీఏ-1 కాలంలో 35 పర్యటనలు చేసిన మన్మోహన్.. యూపీఏ-2లో 37 పర్యటనలు పూర్తి చేసుకున్నారు. మొత్తం మీద 10 పర్యాయాలు అమెరికాకు వెళ్లొచ్చారు. రష్యాలో తొమ్మిదిసార్లు పర్యటించారు. అదే సమయంలో, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికాలను మాత్రం మర్చిపోయారు. ప్రధాని ఈ స్థాయిలో పర్యటనలకు ఖర్చు చేయడంపై పలు విమర్శలు వినపడుతున్నాయి.

  • Loading...

More Telugu News