: కుప్పకూలిన వంతెన.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్


విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా భోగాపురం మండలం రావాడ సమీపంలోని ఓ వంతెన ఈ రోజు కుప్పకూలింది. ఓ కాల్వపై నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో, దాదాపు 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం ఆసుపత్రికి వెళ్లాలన్నా వీలుకాని పరిస్థితి ఏర్పడిందని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News