: చిదంబరంతో గవర్నర్ నరసింహన్ భేటీ
ఢిల్లీలోని పార్లమెంటు నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమంటూ అధిష్ఠాన నేతలు చెబుతున్న క్రమంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, నరసింహన్ ఈ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశం కానున్నారు.