: ఉద్యమానికి విరామం తాత్కాలికమే: అశోక్ బాబు


రెండు నెలల తర్వాత సమ్మెను విరమించినా, ఈ విరామం తాత్కాలికమేనని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పునరుద్ఘాటించారు. ముసాయిదా బిల్లు అనంతరం ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని శ్రీకాకుళంలో ప్రకటించారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. పదవికోసం ఉద్యమాన్ని చులకన చేసే రాజకీయ నాయకులకు భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారు. సమైక్యవాదాన్ని నిజాయతీగా వినిపించే పార్టీలకే పట్టంకడతామని, రాజీనామా చేయకుండా ఉన్న మంత్రులకు భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. విభజన విషయంలో రాజకీయ నాయకుల ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు పడనీయకుండా చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News