: గుండ్లకమ్మ రిజర్వాయర్ 6 గేట్లు ఎత్తివేత


అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అప్రమత్తమైన అధికారులు 6 గేట్లు ఎత్తివేసి 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అంతే కాకుండా, భారీ వర్షాలతో జిల్లాలోని ఒంగోలు-చీరాల రహదారి జలమయమైంది. దీంతో, ఈ రోడ్డుపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News