: బస్టాండ్లలో నిఘా కెమేరాలు
ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రయాణికుల భద్రత విషయమై ఆర్టీసీ ముందే మేల్కొంది. రాష్ట్రంలోని పలు బస్టాండ్లలో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో ముందుగా సీసీటీవీ కేమేరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అంచనాలు రూపొందించారు.