: చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ మేకపాటి


కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై  విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా చేపట్టిన సంతకాల కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం దారుణమని ఆయన అన్నారు. వైస్రాయి హోటల్ లో ఎమ్మెల్యేలతో దొంగ సంతకాలు పెట్టించిన చరిత్ర  చంద్రబాబుదని మేకపాటి ఆరోపించారు. మైనార్టీలో పడ్డ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News