: రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు


రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో స్థిరంగా కొనసాగుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీగా, తెలంగాణలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News