: 10 లక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం: అశోక్ బాబు


పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే 10 లక్షల మందితో హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. కాకినాడ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అందరిదీ అని చెప్పేందుకే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అపోహల ఆధారంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమన్నారు. రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విడదీయాలనే విషయం చెప్పకుండా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలను రాజకీయ నాయకులు దద్దమ్మల్లా జమకడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News