: మ్యాచ్ టిక్కెట్లపై సచిన్ ఫొటో


వచ్చే నెలలో విండీస్ తో ముంబైలో జరిగే టెస్టు సందర్భంగా వీక్షకులకు జారీ చేసే టిక్కెట్లపై సచిన్ ఫొటో ముద్రించనున్నారు. ఈ మ్యాచ్ సచిన్ కెరీర్లో 200వ టెస్టు కాగా, ఆ పోరు అనంతరం బ్యాటింగ్ దేవుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. త్వరలోనే టిక్కెట్ల విక్రయం మొదలు పెట్టనున్నారు. కాగా, సచిన్ కు ప్రత్యేకంగా 500 టిక్కెట్లను అందిస్తారు. సచిన్ బంధుమిత్రుల కోసం వాటిని కేటాయించారు. సచినేమీ ప్రత్యేకంగా టిక్కెట్లు కావాలని అడగలేదని, తామే అతడి గౌరవార్థం వాటిని ఇస్తున్నామని ముంబయి క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా, నవంబర్ 11న సచిన్ ను కాండివ్లీ మైదానంలో సత్కరించనున్నారు. ఆ మైదానానికి సచిన్ పేరు పెట్టాలని ముంబయి క్రికెట్ సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News