: మైదానానికి సచిన్ పేరు


త్వరలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో వైదొలగనున్న బ్యాటింగ్ లెజండ్ సచిన్ టెండూల్కర్ ను ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) విశిష్ట రీతిలో గౌరవించింది. ముంబయిలోని కాండివ్లీ మైదానానికి సచిన్ పేరు పెట్టింది. ఇక నుంచి ఆ మైదానాన్ని సచిన్ టెండూల్కర్ జింఖానా క్లబ్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఎంసీఏ నూతన అధ్యక్షుడు శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెస్టు కెరీర్ చివరి మ్యాచ్ ను సచిన్ ముంబయిలోని వాఖండే మైదానంలో ఆడనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News