: జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు బదిలీ
జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కొత్త కమిషనర్ గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. త్వరలోనే ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. కృష్ణబాబు సహా పద్నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు.