: కాశ్మీర్ పై భారత్ వ్యాఖ్యలు దురదృష్టకరం: పాక్


కాశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమంటూ భారత ప్రభుత్వాధినేతలు చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని పాక్ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇప్పటికీ ఇరుదేశాల మధ్య కాశ్మీర్ సమస్యే ప్రధాన చర్చనీయాంశమని పేర్కొంది. కాశ్మీర్ సమస్య నేటికీ అపరిష్కృతంగానే ఉందని విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ తమదే అని భారత నేతలు అంటున్నారని, కానీ, వాస్తవిక పరిస్థితి మరోలా ఉందని ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News