: రాత్రి పూట మెరిసే రోడ్లు


రాత్రిపూట కూడా పట్టపగల్లా మెరిసే రోడ్లుంటే ఎంత బాగుంటుందో కదా? లండన్ లో ఓ సంస్థకి చెందిన ఇంజనీర్లకి కూడా ఈ ఆలోచనే వచ్చినట్టుంది. రాత్రిపూట వెలుగులు వెదజల్లే 'పిచ్ బ్లాక్ రోడ్ స్ప్రే'ను 'ప్రో-టెక్' సంస్థ ఇంజనీర్లు తయారు చేశారు. ప్రయోగాత్మకంగా దీన్ని కేంబ్రిడ్జి నగరంలోని క్రీస్ట్ పీసెస్ పార్కులో రోడ్లపై వాడారు. ఈ స్ప్రే రోడ్లపై వెలుగులు వెదజల్లడమే కాకుండా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆవిష్కర్తలు అంటున్నారు. వీటి వినియోగం వల్ల ఏ సమస్యలు రావని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News