: బాలీవుడ్ టాప్ ర్యాంకుల్ని కైవసం చేసుకున్న సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్
బాలీవుడ్ లో అత్యంత ప్రముఖుడిగా సల్మాన్ ఖాన్ రెండోసారి కూడా వరుసగా ట్యాప్ ర్యాంక్ కొట్టేశాడు. 'టైమ్స్ సేలేబెక్స్' నెలవారీ రేటింగులలో జనవరి నెలకు కూడా సల్మాన్ నెంబర్ వన్ స్థానంలోనే నిలిచాడు. బాక్సాఫీసు వసూళ్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వార్తలలో నిలవడం, బ్రాండ్ ఎండార్స్ మెంట్, అభిమానులలో ఆదరణ వంటి వివిధ అంశాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో ఈ రేటింగ్స్ ఇస్తున్నారు.
56 పాయింట్లతో సల్మాన్ హీరోలలో మొదటి స్థానంలో వుండగా, 46 పాయింట్లతో కత్రినా కైఫ్ హీరోయిన్లలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇక షారుఖ్ ఖాన్ 46 పాయింట్లు, ప్రియాంకా 44 పాయింట్లతో ద్వితీయ స్థానాలలో నిలిచారు.