: ఆ ఫైళ్లన్నీ అప్పగించండి: ప్రధాని కార్యాలయానికి సీబీఐ లేఖ
బొగ్గు కుంభకోణంలో సీబీఐ స్పీడు పెంచింది. కుమారమంగళం బిర్లాకు చెందిన హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తమకు అప్పగించాలని ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది. కుంభకోణంపై విచారణ ప్రారంభించడానికి ముందే ఒకసారి ఆ ఫైళ్లన్నింటినీ సమీక్షించాల్సి ఉందని... అందువల్ల మొత్తం ఫైళ్లను తమకు అందజేయాలని సీబీఐ కోరింది.