: కరవుపై వారంలోగా నివేదిక పంపాలి: రఘువీరా
కరవుపై వారం రోజుల్లోగా కలెక్టర్లు నివేదిక పంపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం, కరవు మండలాలపై పూర్తి నివేదిక పంపాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ ద్వారా తుపాను బాధితులను కూడా ఆదుకునే వీలుంటుందని ఆయన అన్నారు. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతుల పంటల వివరాలు అడంగులలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.