: ఛార్జీలు పెంచే యోచనలో ఆర్టీసీ
బస్సు ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఎంత మేరకు ఛార్జీలు పెంచాలనే విషయమై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం ముందుకు బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనల ఫైలును పంపనున్నారు. దానిని పరిశీలించి సర్కారు అనుమతి ఇవ్వగానే ఆర్టీసీ ఛార్జీలు పెంచనుంది. దాదాపుగా, అన్ని బస్సు సర్వీసుల్లో కిలోమీటరుకు కనిష్ఠంగా పది పైసల ఛార్జీ పెంచాలనుకుంటున్నట్లు సమాచారం. రెండు నెలలకు పైగా సీమాంధ్రలో కార్మికుల సమ్మె.. అటు డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు తెరదీసినట్టు తెలుస్తోంది.