: నరేంద్ర మోడీకి షాక్ ... వార్టన్ సదస్సులో ఆయన ప్రసంగం రద్దు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్ఠాత్మక వార్టన్ ఇండియా ఆర్ధిక ఫోరం సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన చేయాల్సిన ప్రసంగాన్ని రద్దు చేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ఈ సదస్సులో షెడ్యూలు ప్రకారం, వీడియో కాన్ఫరెన్సు ద్వారా మోడీ ప్రసంగించాల్సి వున్న విషయం తెలిసిందే. అయితే, మోడీకి ఆహ్వానంపై ఫోరం సభ్యుల్లో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన ప్రసంగాన్ని రద్దు చేశారు. వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివేర్సటీ విద్యార్ధుల ఆధ్వర్యంలో ఈ ఫోరం నడుస్తోంది.