: టీచర్లకు కరవు భత్యం ఇవ్వాలి: పీఆర్టీయూ
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వెంటనే కరవు భత్యం విడుదల చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పీఆర్టీయూ నేతలు ఈ ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. 8.56 శాతం డీఏను జూలై 1 నుంచి వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మధ్యంతర భత్యాన్ని కనీసం 50 శాతం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.