: నిరర్థక ఆస్తుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది: చిదంబరం
నిరర్థక ఆస్తుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే పరిస్థితి మెరుగవుతుందన్నారు. బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల శాఖలు, 34,668 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకుకు సంబంధించిన 30 ఏన్ పీఏ ఎకౌంట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ మానిటర్ చేస్తుందని పేర్కొన్నారు. తొలి త్రైమాసికంలో రుణాల వృద్ధి సంతృప్తికరంగా ఉందని, రెండో త్రైమాసికంలో గృహరుణాల వృద్ధి 61 శాతంగా నమోదైందని తెలిపారు.