: సిరీస్ సమం చేస్తారా..?


ఆసీస్ తో ఏడు వన్డేల సిరీస్ లో 1-2తో వెనకబడిన టీమిండియా నాలుగో వన్డేకు సమాయత్తమవుతోంది. రేపు రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయాలని భారత జట్టు వ్యూహకర్తలు భావిస్తున్నారు. మొహాలీలో జరిగిన గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సొంతగడ్డ రాంచీలోనూ బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తుండగా, బౌలింగే కలవరపెడుతోంది. కెరీర్ తొలినాళ్ళలో స్వింగ్ తో ఆకట్టుకున్న యువ పేసర్ భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపడంలేదు. అనుభవంతో ఆదుకుంటాడునుకున్న ఇషాంత్ మొహాలీ మ్యాచ్ కోల్పోవడానికి కారణమయ్యాడు. స్పిన్నర్ల విషయానికొస్తే అశ్విన్, రవీంద్ర జడేజాలు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. బ్యాటింగ్ పిచ్ లపై బంతి టర్న్ కాకపోవడం వీరికి ప్రతికూలంగా మారింది.

ఇక, ఆసీస్ జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో విజయం దక్కడం వారి ఆత్మస్థయిర్యాన్ని ఇనుమడింపజేసింది. సిరీస్ లోని మిగిలిన వన్డేల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ఆసీస్ ఆటగాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాంచీలో వర్షాలు పడుతుండడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలపడం నిస్సందేహంగా క్రికెట్ ప్రేమికులకు చేదు వార్తే.

  • Loading...

More Telugu News