: విశాఖలో ప్రపంచవింతల లోకం


ఇక ప్రపంచ వింతలు చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు...విశాఖపట్నం వెళితే చాలు ... అన్నిటినీ హ్యాపీగా ఒకేచోట చూసేయచ్చు. వండర్స్ ఆఫ్ వరల్డ్ గా పేరుగాంచిన ఏడు ప్రపంచ వింతల నమూనాలను విశాఖలో ఒకే చోట తీర్చిదిద్దుతున్నారు. విశాఖలోని ఎండాడ వద్ద అరవై ఎకరాల స్థలంలో ఈ ప్రాజక్టుకు రూపకల్పన చేస్తున్నారు.

'వండర్స్ ఆఫ్ ద వరల్డ్' పేరిట ఈ థీమ్ పార్క్ ప్రాజక్టు నిర్మాణాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ చేబడుతోంది. 110 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజక్టుకు రూపకల్పన చేస్తున్నారు. ఈ పార్కును విద్యా వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ భావిస్తోంది. దీంతో దేశ, విదీశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని ఆశిస్తున్నారు.  

  • Loading...

More Telugu News