: లాలూ అనర్హతపై రబ్రీదేవి స్పందన
దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపై భార్య రబ్రీదేవి స్పందించారు. కుట్రతోనే తన భర్తపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. ఇవన్నీ నీచ రాజకీయాలని ఆరోపించారు. అయితే, తనకు భారత న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. కాగా, లాలూ లేకపోయినా పార్టీని సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తనకెలాంటి ఇబ్బంది లేదని రబ్రీ చెప్పుకొచ్చారు.