: 'పర్ఫెక్ట్' పిచ్ కావాలంటున్న సచిన్


మరో రెండు టెస్టుల అనంతరం బ్యాటింగ్ రారాజు సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఇప్పటివరకు 198 టెస్టులాడిన ఈ ముంబై వాలా 200వ టెస్టే తనకు చివరదని ప్రకటించాడు. అందుకే, ఆ మ్యాచ్ కు సొంతగడ్డ వాంఖడే మైదానాన్ని వేదికగా ఖరారు చేయాలని సచిన్ కోరగా.. బీసీసీఐ మన్నించింది. ఇప్పుడు ఆ మ్యాచ్ కోసం తన బ్యాటింగ్ శైలికి అతికినట్టు సరిపోయే పిచ్ రూపొందించాలని సచిన్ అంటున్నాడు. విండీస్ తో జరిగే ఆ మ్యాచ్ ను వీక్షించేందుకు తన తల్లి రజని కూడా వస్తోందని, ఆమెతో పాటు అభిమానులనూ నిరాశ పరచడం తనకిష్టంలేదని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. అందుకే 'పర్ఫెక్ట్' తయారుచేయాలని ముంబయి క్రికెట్ సంఘానికి సూచించాడు.

  • Loading...

More Telugu News