: మన్మోహన్ కు పుతిన్ మూడు ప్రత్యేక బహుమానాలు
రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ మూడు ప్రత్యేక బహుమతులు అందించారు. వీటిని పుతినే ప్రత్యేకంగా ఎంపిక చేశారట. 1890-91లో భారత్ లో పర్యటించిన రష్యన్ చక్రవర్తి నికోలస్-2 పెయింటింగ్, 16వ శతాబ్దం నాటి భారత మ్యాప్, మొఘల్ రాజుల ముందు కాలానికి చెందిన ఒక నాణెం వీటిలో ఉన్నాయి. భారత్-రష్యాల చారిత్రక బంధానికి నిదర్శనంగా నిలిచే వీటిని పుతిన్ బహుమతులుగా ఎంపిక చేశారని రష్యాలోని భారత రాయబారి అజయ్ మల్హోత్రా మాస్కోలో మీడియాకు తెలిపారు.