: ఢిల్లీ హైకోర్టులో మసూద్ పిటిషన్
రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన అనంతరం కాంగ్రెస్ నేత రషీద్ మసూద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మెడికల్ సీట్ల కేటాయింపు స్కాంలో దోషిగా తేలిన మసూద్ కు ట్రయల్ కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. పరిశీలించిన జస్టిస్ హిమా కోహ్లీ... మసూద్ అభ్యర్ధనపై నవంబర్ 13లోగా స్పందించాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు. కాగా, తన క్లయింట్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విధించిన శిక్షను నిలుపుదల చేయాలని ఆయన న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అంతేకాక మసూద్ పై గత 17 సంవత్సరాలుగా విచారణ జరుగుతోందని తెలిపారు.