: పాక్ లో బాంబు పేలుళ్లు.. 12 మంది మృతి
పాకిస్తాన్ లోని కరాచీ నగరం ఈ రోజు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇక్కడి అబ్బాస్ టౌన్లోని ఓ ప్రార్థన మందిరం వద్ద ఈ సాయంత్రం సంభవించిన పేలుళ్ల ధాటికి 12 మంది మరణించగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తొలి పేలుడు జరిగిన పది నిమిషాల అనంతరం రెండో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం.